బాబు టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్ : ధరల పెరుగుదలను నిరసిస్తూ ఉద్యమాలు చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వామపక్షాలతో కలసి స్థానికంగా ఉద్యమాలు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మార్చి ఆరో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పెట్రోల్, డీజీల్, నిద్యవసరాల ధరలు పెంపును నిరసిస్తూ దర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐ, పార్టీలతో కలసి ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
News Posted: 4 March, 2010
|