'టి' నేతలతో బొత్స కుమ్మక్కు హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ నాయకులతో కుమ్మక్యయ్యారని తేలిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ ఆరోపించారు. కేసీఆర్, దామోదర్ రెడ్డి వంటి తెలంగాణ నాయకులు పదే పదే బొత్సను పొగుడుతూ ఆకాశానికెత్తడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. బొత్సను ముఖ్యమంత్రిని చేసినా, లేకున్నా తెలంగాణ జేఏసీకి గౌరవాధ్యక్షులుగా నియమించాలని సూచించారు. బొత్స సమైక్యాంధ్రకు తూట్లు పొడిస్తే తన భార్య కూడా తన వెంట రాదని తెలిసిపోయిందని ఎద్దేవా చేసారు. తెంలగాణకు వంత పాడటం వెనుక కేసీఆర్ తో ఏం లాలూచీ పడ్డారో చెప్పాలని డిమాండ్ చేసారు.
News Posted: 4 March, 2010
|