సినీ నిర్మాత ఇంటిపై ఐటి దాడులు హైదరాబాద్ : సినీ కమెడియన్ ఆర్టిస్టు, నిర్మాత గణేష్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేసారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సమాచారం రావడంతో ఐటీ అథికారులు ఈ దాడులు చేపట్టారు. గణేశ్ ఇటీవల రవితేజ హీరోగా ఆంజనేయలు సినిమా తీసారు. మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మిస్తున్నారు.
News Posted: 4 March, 2010
|