హెలికాప్టర్ క్షేమం హైదరాబాద్ : సాంకేతిక లోపం తలెత్తిన హెలికాప్టర్ క్షేమంగా దిగింది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో అత్యవసరంగా లాండ్ అయిందని హైదరాబాద్ కేంద్రానికి సమాచారం అందింది. ఖనిజవనరుల శాఖ ఆధ్వర్యంలో సర్వే కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ బయులదేరింది. కొద్దిసేపటికే దీనిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్ గల్లంతు కావడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీపీ ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులతో మాట్లాడి గాలింపు చేపట్టాలని ఆదేశించారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో హుజూర్ నగర్ లో ల్యాండ్ అయినట్లు సమాచారం అందడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
News Posted: 5 March, 2010
|