'ధరలపై ఉద్యమం ఆగదు' హైదరాబాద్ : పెరిగిన ధరలను తగ్గించే వరకు తమ ఉద్యమం ఆగబోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్పష్టం చేసారు. పెట్రో ఉత్పత్తుల పెంపు, నిత్యవసర వస్తువులపై పన్నుల పెంపును నిరసిస్తూ తాము ఆరో తేదీన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో వామపక్షాలతో కలసి తమ పార్టీ మహాధర్నా నిర్వహిస్తుందని వివరించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో టీడీపీ నేత చంద్రబాబునాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ వీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలు పాల్గొంటారని ఆయన చెప్పారు.
News Posted: 5 March, 2010
|