'అంబుడ్స్ మన్ ఏర్పాటు చేయాలి' హైదరాబాద్ : స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్రం నుండే స్థానిక సంస్థలకు నిధులు అందేలా చూడాలని ఆయన సూచించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో లోక్ సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు, భీశెట్టి బాబ్జీ లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించే నిధులు వాటా రెట్టింపు అయిందని, దీంతో ఆ నిధులను రాష్ట్రానికి సంబంధం లేకుండా స్థానిక సంస్థలకు పంపాలని డిమాండ్ చేసారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
News Posted: 5 March, 2010
|