హైదరాబాద్ : రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఓ అడ్వైజరీ కమిటీగా కనిపిస్తోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇది కాంగ్రెస్ కోర్ కమిటీకి అడ్వైజరీ కమిటీగా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కమిటీకి ఎక్కడా చట్టబద్దత లేదని మండిపడ్డారు. ఈ కమిటీ చేసిన సిఫార్సులు చట్టబద్దం చేయలేమని హోంశాఖ కార్యదర్శి పిళ్లై స్వయంగా వెల్లడించారని ఆయన వివరించారు. కేవలం ప్రెస్ నోట్ ద్వారానే కమిటీని నియామకం చేసారని యనమల ఆరోపించారు.