కిషన్ రెడ్డి ఏకగ్రీవం హైదరాబాద్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అంబర్ పేట ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ విషయాన్ని పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజీపీ సీనియర్ నాయకులు ప్రకాష్ జవదేకర్, దత్తాత్రేయ, డాక్టర్ కె. లక్ష్మణ్, విద్యాసాగర్ రావుల సమక్షంలో కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్ష పదవికే బద్దం బాల్ రెడ్డి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీనితో కిషన్ రెడ్డి నామినేషన్ ఒక్కటే మిగిలి ఉంది. కిషన్ రెడ్డి ఎన్నికను పార్టీ శనివారంనాడు అధికారిరంగా ప్రకటించే అవకాశం ఉంది.
News Posted: 5 March, 2010
|