కిషన్ రెడ్డికి జేపీ అభినందన హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన కిషన్ రెడ్డికి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభినందనలు తెలిపారు. పార్టీల సిద్ధాంతాలు వేరైనా అందిరి లక్ష్యం ప్రజా సంక్షేమమేనని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలపై గౌరవం పెంచేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలోజేపీ ఆకాంక్షించారు. పార్లమెంటరీ విలువలను కాపాడటం, బహిరంగ చర్చల్లో ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలని ఆయన కిషన్ రెడ్డికి సూచించారు.
News Posted: 6 March, 2010
|