హైదరాబాద్ : ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తున్న సందర్భంలో న్యాయవాదులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమైనదని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తాము ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వచ్చి రెచ్చోగట్టేలా వ్యవహరించారని ఆరోపించారు. న్యాయవాదులు కంటే సహజంగానే ఆవేశపూరితంగా ఉండే ఓయూ విద్యార్థులే మెరుగనిపించారని ఆయన పేర్కొన్నారు. గత 20 రోజులుగా న్యాయవాదులు న్యాయవ్యవస్థ ప్రమాణాలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.