'ప్రధానికి బ్లాక్ మెయిలింగ్ తగదు' హైదరాబాద్ : ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజలను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆర్థిక సంస్కరణల పేరిట నిరు పేద ప్రజలను జలగాలు పీల్చుకుతింటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. పన్నలు, ధరలు పెంచకపోతే అభివృద్ధి జరగదని, ఉద్యోగాలు రావని ప్రధాని వ్యాఖ్యానించడం సరికాదని చంద్రబాబు విమర్శించారు. పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ, సీపీఎఁ, సీపీఐలు శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నిధులు సమకూర్చుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్గాలున్నా ప్రజలపై భారం మోపే వైపే మొగ్గు చూపడం తగదన్నారు. ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న ప్రధాని వైఖరికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీలు వంత పాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
News Posted: 6 March, 2010
|