సీఎం ఇల్లు ముట్టడి హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్య ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ముందు విద్యార్థులు సోమవారం ఉదయం బైఠాయించి నిరసన తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు చెల్లించాలంటూ డిమాండ్ చేసారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 7 March, 2010
|