ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య వెల్లడించారు. పదో తేదీ నుండి పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. 365 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు ఆయన చెప్పారు. జవాబు పత్రాలపై విద్యార్థులు నినాదాలు రాయకూడదని సూచించారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర వంటి నినాదాలు రాస్తే వాటిని మాల్ ప్రాక్టీస్ గా గుర్తిస్తామని ఆయన హెచ్చరించారు.
News Posted: 8 March, 2010
|