హైదరాబాద్ : రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం రేణిగుంట విమానాశ్రయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి మైనంపల్లి రాజీనామా లేఖను అందచేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాధన కోసం తన పదవికి 9న రాజీనామా చేస్తానని మైనంపల్లి గతంలో ప్రకటించారు.