'మహిళా బిల్లుపై రాజకీయం వద్దు' హైదరాబాద్ : మహిళా బిల్లుపై రాజకీయం చేయడం తగదని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు సాగిస్తున్న చర్చలు తీరు తీవ్ర నిరాశకు గురి చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. బహిరంగ చర్చలో వ్యక్తిగత దూషణలు, అప్రాజస్వామిక భాషను వాడటం నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. పరస్పర గౌరవ భావంతో, హేతుబద్ధత, సాక్ష్యాధారాల ప్రాతిపదికన బహిరంగ చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయం తీరు మారితేనే మహిళా బిల్లుకు మోక్షం కలుగుతుందని జేపీ అభిప్రాయపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే సర్వరోగ నివారిణి కాదని జేపీ వ్యాఖ్యానించారు.
News Posted: 8 March, 2010
|