హైదారాబాద్ : నగరంలోని విద్యుత్ సౌధను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. విద్యుత్ కొతను నిరసిస్తూ మంగళవారం పీఆర్పీ కార్యకర్తలు ఆందళన చేపట్టారు. విద్యుత్ సౌధ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీఆర్పీ నేతలు విమర్శించారు. పీఆర్పీ ధర్నా నిర్వహణపై ముందే సమాచారం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు.