జేపీకి పితృవియోగం హైదరాబాద్ : లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తండ్రి నాగభైరవ వెంకటేశ్వర రావు బుధవారం హైదరాబాద్ లో కన్నుమూసారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, వారిలో జేపీ పెద్దవారు. వెంకటేశ్వర రావు కొద్దిరోజుల క్రితం విజయవాడలోని ఆయన నివాసంలో స్నానాల గదిలో కాలు జారి పడిపోయారు. దీంతో ఎర్రమంజిల్ కాలనీలోని జేపీ సోదరుని ఇంటిలో ఉంటున్నారు. బుధవారం రాత్రి పది గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివశరీరాన్ని విజయవాడకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
News Posted: 11 March, 2010
|