సెరీనా నగ్న ప్రదర్శన!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/serena.jpg' align='right' alt=''>మెల్బోర్న్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ చాంపియన్ సెరెనా విలియమ్స్ స్పోర్ట్స్ మేగజైన్ 'ఇఎస్ పిఎన్'కు నగ్నంగా పోజు ఇచ్చినందుకు, యుఎస్ ఓపెన్ సెమీ ఫైనల్స్ లో అసాధారణ రీతిలో తన ఆగ్రహాన్ని వెలిబుచ్చినందుకు 2010లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడే అవకాశాన్ని కల్పించకపోవచ్చు. సెరెనా విలియమ్స్ పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) దర్యాప్తు జరుపుతున్నదని, క్రీడల ప్రవర్తన నియమావళి కింద రెండు గ్రాండ్ శ్లామ్ ల వరకు ఆమె నిషేధాన్ని ఎదుర్కోవచ్చని 'డైలీ టెలిగ్రాఫ్' పత్రిక తెలియజేసింది.
'ఫుట్ ఫాల్ట్ కాల్'కు ఆగ్రహావేశాలకు లోనైన సెరెనా 'నీకు నా గురించి తెలియదు. నీ సంగతి సరి చూసుకో. ఈ బంతిని తీసుకుని నేరుగా నీ గొంతులోకి దింపగలనని భగవంతుని ప్రమాణంగా చెబుతున్నాను' అని బేస్ లైన్ జడ్జిని బెదరించింది. సెరెనా తనను హతమారుస్తానని బెదరించిందని లైన్స్ వుమన్ ఆరోపించినట్లు తెలుస్తున్నది.
బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లిస్టర్స్ తో పోటీలో ప్రవర్తన నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించిన తరువాత సెరెనాకు స్టేడియంలో అధికారులు గరిష్ఠంగా 11,300 డాలర్ల మేరకు జరిమానా విధించారు. (సెరెనాపై విజయంతో క్లిస్టర్స్ ఫైనల్ కు చేరుకుని యుఎసె ఓపెన్ టైటిల్ ను హస్తగతం చేసుకున్న విషయం విదితమే.) 5 లక్షల డాలర్లకు పైగా నగదు బహుమతిని సెరెనాకు లభించకుండా చేయడానికి, నిషేధం విధించడానికి ఐటిఎఫ్ కు అధికారం ఉంది. సెరెనా విలియమ్స్ వివస్త్రగా ఇఎస్ పిఎన్ మేగజైన్ కవర్ పేజీపై ఫోటోకు పోజు ఇచ్చినందున ఆమె ఈ శిక్షకు గురి కాబోతున్నది.
సెరెనా విలియమ్స్ ఆగ్రహావేశాలతో దూషణకు దిగడం క్రీడా నిబంధనల కింద 'పెద్ద నేరం'గా పరిగణించినట్లయితే, ఒక గ్రాండ్ శ్లామ్ నుంచి అమెరికన్ జెఫ్ టరాంగో నిషేధానికి గురైన తరువాత 15 సంవత్సరాలలో ఆమె మొదటి ప్లేయర్ అవుతుంది. 1995లో వింబుల్డన్ టోర్నమెంట్ లో జర్మన్ అలెగ్జాండర్ మ్రోంజ్ తో మూడవ రౌండ్ పోటీలో ఒక లైన్ కాల్ తో విభేదించిన తరువాత టరాంగో కోపంగా కోర్టులో నుంచి నిష్క్రమించాడు. ఫ్రెంచ్ అంపైర్ బ్రూనో రెబ్యూ అవినీతిపరుడని టరాంగో ఆరోపించాడు. పర్యవసానంగా టరాంగోను ఆ తదుపరి సంవత్సరం వింబుల్డన్ తో సహా రెండు గ్రాండ్ శ్లామ్ లలో పాల్గొనకుండా నిషేధించారు.
స్వయంగా విచారణకు హాజరై తన వాదన వినిపించేందుకు సెరెనాకు అవకాశం ఇస్తారని తెలుస్తున్నది. అయితే, ఆమె మొదట్లో విచారం వ్యక్తం చేయకపోవడం ఆమెకు ఈ కేసులో నష్టదాయకం కావచ్చునని కొందరు భావిస్తున్నారు. సస్పెండైన పక్షంలో ఆమె ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చు.
News Posted: 8 October, 2009
|