ఏటిఎమ్ ల ఔట్ సోర్సింగ్
ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎమ్ లను నిర్వహణ భారాన్ని వదిలించుకోవాలని చూస్తోంది. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల (ఏటిఎమ్), క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులను నిర్వహించే పాయింట్ ఆప్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ ను నిర్వహించేందుకు ఔట్ సోర్సింగ్ మార్గాన్ని ఎంచుకుంది. బ్యాకింగ్ సాంకేతిక పరిజ్ఞానమున్న కంపెనీలకు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు ఐసిఐసిఐ రూపొందిస్తున్న వ్యవస్థలో అంతర్భాం కావచ్చు. బారత దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఒక ప్రైవేట్ బ్యాంకు తన ఏటిఎమ్, పిఓఎస్ సేవలను ఇతర కంపెనీలకు అప్పజెప్పడం ఇదే తొలిసారి.
రెండవ అతిపెద్ద ఏటిఎమ్ వ్యవస్థ కలిగిన ఐసిఐసిఐ బ్యాంకుకు 4 వేల ఏటిఎమ్ మిషన్లున్నాయి. అదే విధంగా అతిపెద్ద పిఓఎస్ నెట్ వర్క్ కలిగిన ఐసిఐసిఐ బ్యాంకుకు దాదాపు 2 లక్షలకు పైగా పిఓఎస్ టెర్మినల్స్ ఉన్నాయి. వీసా, ఎఫ్ ఎస్ఎస్, టోటల్ సిస్టెమ్స్ సర్వీసెస్, కెకెఆర్ కు చెందిన ఫస్ట్ డేటా కార్పొరేషన్, బ్లాక్ స్టోన్-సిఎమ్ెస్ డేటా కార్పొరేషన్, వెంచర్ ఇన్ఫోటెక్ లాంటి పలు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏటిఎమ్ సర్వీసులను నిర్వహించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని బ్యాంక్ వర్గాలు తెలియజేశాయి. ఐసిఐసిఐ బ్యాంక్ తో కలసి పనిచేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్లోబల్ సంస్ధలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి.
'బ్యాంకులు ఇలాంటి ఏర్పాట్లను చేసుకోవడం మంచిదే. ఏటిఎమ్ నిర్వహణ కోట్ల రూపాయల వ్యాపారం కాదు. 2000 సంవత్సరంలో ఐసిఐసిఐ బ్యాంకు ఏటిఏమ్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసినపుడు ఇలాంటి ఆలోచనే లేదు.'అని చీఫ్ మార్కెటింగ్ ఆపీసర్ మణి మమల్లన్ తెలిపారు. ఐసిఐసిఐ బ్యాంకు ఏటిఎమ్ ల నిర్వహణకుగాను ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. దాంతో కాలాన్ని సరికొత్త ఏటిఎమ్ మిషన్లను అత్యంత వేగంగా వినియోగంలోకి తీసుకవచ్చే అవకాశముంటుంది. భారత దేశంలో 35 వేల ఏటిఎమ్ లున్నాయి. ఇదే చైనా లో దాదాపు 1.3 లక్షల ఏటిఎమ్ లున్నాయి. చాలా బ్యాంకులు ఏటిఎమ్ ల నిర్వహణ ఇతర సంస్థలకు అప్పజెప్పుతున్నాయి. అందుకోసం సంబంధిత బ్యాంకులు అద్దె చెల్లిస్తాయి.
ఐసిఐసిఐ బ్యాంకులన్నటి కంటే భిన్నంగా ఆలోచిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు ఇందుకోసం కొత్త కంపెనీని ప్రారంభించి ఇతర స్టాక్ హోల్డర్లను ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు అవకాశం కల్పించింది. దేశంలో అగ్ర భాగాన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా దాదాపు 300 ఏటిఎమ్ లను టాటా కమ్యూనికేషన్స్ నుండి ఔట్ సోర్సింగ్ పొందుతోంది. ప్రతి లావాదేవీకి బ్యాంకు అద్దె చెల్లిస్తోంది. అదే విధంగా సి-ఎడ్జ్ కంపెనీతో ఎస్ బిఐ బ్యాంకుతో 200 ఏటిఎమ్ లకు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆసియాలోని స్టాన్ చార్ట్ బ్యాంకుతో 'ఫస్ట్ డేటా' సంస్థ పిఓఎస్ టెర్మినల్స్ విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, దేనా బ్యాంక్ లు ఫిడిలిటీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏప్రిల్ నుండి భారత దేశంలో ఏటిఎమ్ లద్వారా బ్యాంకులతో లావాదేవీలు జరుపనున్నారు. లావాదేవీలకు అయ్యే ఖర్చులను బ్యాంకులు త్వరలో నిర్ణయించునున్నాయి. ఏటిఎమ్ నిర్వహణ కోసం పలు ఇతర అంశాలను అన్వేషిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంకు వర్గాలు తెలియజేశాయి. ఇతర బ్యాంకులు ఇప్పటికే ఏటిఎమ్ ఔట్ సోర్సింగ్ ను ప్రారంభించాయి. ఆ రంగంలో కొత్త పద్దతులను ఐసిఐసిఐ అన్వేషించడం ప్రారంభించింది. ఐసిఐసిఐ ప్రతిపాదనకు వచ్చే స్పందన చూసుకుని ఆచితూచి అడుగు వెయ్యాలని మిగిలిన బ్యాంకులు ఎదురు చూస్తున్నాయి
News Posted: 18 March, 2009
|