సెంట్రల్ జైలుకు పిక్నిక్!
చెన్నై: ఇప్పటికి శతాబ్దిన్నర కాలంపైగా చెన్నైలోని సెంట్రల్ జైలు గురించి చదివి ఉంటారు . చిత్రాలలో చూసి ఉంటారు లేదా వారూ వీరూ చెప్పగా విని ఉంటారు. పూర్వపు బ్రిటిష్ పాలకులు 1837లో నిర్మించిన చెన్నై సెంట్రల్ జైలును త్వరలో కూల్చివేయనున్నారు. నగరంలో ఒకప్పుడు పేరొందిన ఈ జైలును ప్రజలు చూసేందుకు వీలుగా తెరవాలని అధికారులు నిర్ణయించడంతో అత్యధిక సంఖ్యలో నగర పౌరులు దీనిని ఒకసారి చూసేందుకు లేదా జైలులో మగ్గిన ఖైదీలు లోపల ఉన్నందుకు ఏ భావనలకు గురై ఉంటారో ఊహించేందుకు వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తే ఉనికిని కోల్పోయే సెంట్రల్్ జైలును చూసేందుకు వందలాది మంది ప్రజలు వస్తున్నారు. వారిలో కొందరు పిల్లలతో సహా తమ కుటుంబాలతో వచ్చి జైలు ఆవరణను సందర్శిస్తున్నారు. జైలు స్థానంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అదనపు భవనాలను, ఒక రైల్వే ప్రాజెక్టును నిర్మించనున్నారు.
'నేను రోజూ ఆఫీసుకు వస్తూ పోతూ జైలు పక్క నుంచి సిటీ బస్సులో ప్రయాణిస్తుంటాను. లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో అని అనుకుంటుండేదానిని' అని సమీపంలోని దక్షిణ రైల్వే కేంద్ర కార్యాలయంలో పని చేసే ఒక ఉద్యోగిని చెప్పారు. జైలు లోపల తిరగడం, సెల్ లు, ఉరికంబాలు స్వయంగా చూడడం 'థ్రిల్లింగ్'గా ఉందని ఆమె చెప్పారు. అవినీతి కేసు సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితను జైలులో ఏ సెల్ లో నిర్బంధించారో చూడాలనే ఆత్రుతతో తాను ఉన్నట్లు మరొక సందర్శకురాలు చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 11 February, 2009
|