చేవెళ్ళకు వైఎస్ గుడ్ బై?
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంటు మారింది. గతంలో ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టేవారు. 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కూడా అదే కోవలోకి చెందినదే. ఎన్నికలముందు ప్రకటించిన అభయహస్తం పథకాన్ని కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ఎన్నికల జైత్ర యాత్ర కూడా చేవెళ్ల నుంచే మొదలుపెట్టారు. అప్పటి చేవెళ్ల ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డిని ఆయన చెల్లెమ్మాఅని ఆప్యాయంగా పిలిచేవారు. అప్పటి నుంచి వైఎస్‌కు చేవెళ్ల ఒక సెంటిమెంట్‌గా మారింది. ముఖ్యమంత్రి ప్రదర్శించిన ఆప్యా యత ఫలితంగా సబితకు ‘చేవెళ్ల చెల్లెమ్మ’ అనేది ఒక కీర్తికిరీటంగా మారింది. అయితే, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ సెంటిమెంట్ హటాత్తుగా మారిపోయింది. నియోజక వర్గ పునర్వి భజన తర్వాత చేవెళ్ల విడిపోయింది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టిడిపికి చెందిన అభ్యర్ధి ఎన్నికవడం గమనార్హం.
వైఎస్ సెంటిమెంట్ ప్రకారం ఏ కార్యక్రమం చేసినా చేవెళ్ల నుంచి మొదలుపెట్టవలసి ఉండగా ఇకపై తాను ఏ కార్యక్రమం చేసినా తిరుమల నుంచే మొదలుపెడతానని తాజాగా ప్రకటిం చడం చర్చనీయాంశంమయింది. వైఎస్ సెంటిమెంట్ మారడానికి కారణాలేమిటన్న చర్చ మొదలయింది. చేవెళ్లలో టిడిపి విజయం సాధించింది కాబట్టి, సహజంగా అధికార పార్టీకి ఉండే రాజకీయ కోణంలో తన సెంటిమెంట్ మార్చుకున్నట్లున్నారనికొందరు వ్యాఖ్యానిం చారు. అయితే... హిందువులకు దగ్గర య్యేందుకే తిరుమల సెంటిమెంట్‌కు తెరలే పారని మరికొందరు చెబుతున్నారు. హిందు వులు పవిత్రంగా భావించే తిరుమలకు తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానన్న సంకేతాలు పంపించడం ద్వారా వారికి దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు మైనారిటీలు ఓటుబ్యాంకుగా ఉన్నందునే, స్థానాలు తగ్గినప్పటికీ గత ఎన్ని కల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
News Posted: 15 June, 2009
|