కప్పట్రాళ్లతిప్ప పట్ల వివక్ష నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కప్పట్రాళ్ళతిప్ప.. పోలీసు రికార్డుల్లో పేరు మోసిన 'దొంగల పల్లె'గా నమోదైంది. చెన్నై - కోల్ కతా రైలు మార్గంలో బిట్రగుంట జంక్షన్ కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 1500ల మంది గిరిజన జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉన్నప్పటికీ సామాజిక విపక్షత కారణంగా వీరి సంతానం తమ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. తోటి పిల్లలు వీరిని 'దొంగ ఎరుకులోళ్ళు' అని పిలవడంతో గాయపడ్డ ఆ లేత మనసులు చదువు పట్ల నిరాసక్తత చూపుతున్నాయి.
శతాబ్దం క్రితం ఇక్కడ ఎరుకల వాళ్ళు సరుకుల రవాణా కూలీలుగా పనిచేసేవారు. అయితే, బ్రిటీష్ కాలంలో చెన్నై నుంచి కోల్ కతాకు రైలు మార్గం నిర్మించినపుడు 'తిప్ప' గ్రామానికి దగ్గరలో ఉన్న బిట్రగుంట జంక్షన్ గా అభివృద్ధి చెందింది. ఈ సమయంలో తేలికగా డబ్బు సంపాధించే మార్గంగా రైలు ప్రయాణీకులను దోచుకోవడాన్ని తిప్ప గ్రామస్థులు ప్రారంభించారు. ఈ 'వృత్తి'ని కొన్ని తరాలుగా కొనసాగించడంతో ఆ గ్రామంలోని 'ఎరుకల' వారిని దొంగలుగా సమాజం చూస్తోంది!
1908లో ఎరుకల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను కావలి వద్ద నెలకొల్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ప్రభుత్వాలు ఈ వివక్షతను రూపు మాపడంలో విఫలమయ్యాయని ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించారు.
News Posted: 10 August, 2009
|