ఈ ఏడాది కరవే! న్యూఢిల్లీ : 2009 సంవత్సరాన్ని కరవు ఏడాదిగా ప్రకటించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారతవాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం 30 శాతం తక్కువగా కురవడమే ఇందుకు కారణం. ఆగస్ట్ రెండో పక్షం నుంచి సెప్టెంబర్ వరకు గల వానాకాలంలో సగటు కన్నా అధికంగా వర్షపాతం నమోదు అయితేనే ఈ ముప్పు తప్పేవీలుంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో సగటు వర్షపాతం 890 ఎంఎం, ఆగస్ట్ ద్వితీయ భాగం నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం 324ఎం.ఎం.గా నమోదు అవుతుంది.
దేశంలో కరవు పరిస్థితిని అధిగమించాలంటే 324 ఎంఎం కన్నా అధికంగా 30 శాతం వర్షాలు కురవాలని భారత వాతావరణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏబీ మజుందర్ అంటున్నారు. ఆయన ఆగస్టు తొలివారంలో వానలు వెనుకడుగువేశాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఈ స్థితిలో కూడా ప్రభుత్వం కరవు గురించి మాట్లాడలేదు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కరవు గురించి ప్రకటించడం వృద్ధి రేటుని ప్రభావితం చేస్తోందని భయపడుతోంది.
News Posted: 14 August, 2009
|