'అడుగు'కు పోతున్నజలాలు న్యూఢిల్లీ : దేశంలో భూగర్భజలాలు 'అడుగం'టి పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామం గత దశాబ్దంగా వేగంగా చోటు చేసుకుంటోందని వారు చెబుతున్నారు. 'నాసా' తీసిన ఛాయా చిత్రాల ప్రకారం ఏడాదికి ఒక అడుగు ప్రమాణంలో తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీల్లో 2002 నుంచి 2008 సంవత్సరాల మధ్య 108 క్యూటిక్ కిలోమీటర్ల ప్రమాణంలో భూగర్భంలోని జలాలు - జలప్రవాహాల నుంచి తగ్గిపోయాయని ఈ ఛాయాచిత్రాలు తెలుపుతున్నాయి. ఉత్తరభారతదేశంలో భూగర్భ జలాలు తగ్గడానికి సహజమైన పరిణామాల కన్నా మానవ చర్యలే ఎక్కువగా కారణమౌతున్నట్లుగా జలశాస్త్రవేత్తలు గుర్తించారు. పొలాలకు సాగునీరు వినియోగం, ఇతర అవసరాల వినియోగానికి భూమినుంచి నీటిని విచక్షణ లేకుండా తోడి వేయడం వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి! భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడుగుంతలు, చెక్ డ్యామ్ లు, పొదుపు చర్యలు పాటించకపోవడమే భవిష్యత్ లో జల యుద్ధాలు జరగడం ఖాయం.
News Posted: 14 August, 2009
|