ఆహ్వానమే... పెద్ద యజ్ఞం! హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములాగా మారనుంది. నగరంలో మంత్రులు తదితర ప్రముఖులతో పాటు ఎం ఎల్ సీలు కూడా ఎక్కువగా నివసిస్తున్నారు. మొత్తం 90 మంది విధాన మండలి (ఎంఎల్ సీ) సభ్యుల్లో 43 మంది హైదరాబాద్ లోనే నివసించడమే కాకుండా, వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదయ్యరు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు, పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటాకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపేందుకు ఎంఎల్ సీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ శాసనసభ్యుల చిరునామాలు, ఇతర అవసరమైన వివరాలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) అధికారులు సేకరిస్తున్నారు.
ప్రొటో కాల్ ప్రకారం ప్రభుత్వ శాఖలు నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానించడం, ముఖ్యమంత్రి, ఇన్ చార్జి మంత్రుల కార్యక్రమాలకు - ఎంఎల్ సీలను, రాజ్యసభసభ్యులను, నామినేటెడ్ శాసనసభ్యులను శాసనసభ్యులతో పాటు ఆహ్వానించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎంఎల్ సీలు ఎంచుకున్న నియోజకవర్గంలో వారికి ప్రొటోకాల్ వర్తిస్తుంది. గ్రేటర్ నియోజకవర్గాల్లో - అంబర్ పేటను ముగ్గురు, ఖైరతాబాద్ ను - ఇద్దరు, మేడ్చల్ ను - ఇద్దరు ఎంఎల్ సీలు తమకు ప్రొటో కాల్స్ కోరుకున్నారు. ఇంకా కొంతమంది ఎంఎల్ సీలు తమకు కావలసిన నియోజకవర్గాలను తెలపలేదు.
News Posted: 18 September, 2009
|