తగ్గిన వెంకన్న రాబడి! తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్స వాలకు యాత్రికుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా తగ్గింది. గత ఏడాదితో సరిపోలిస్తే 4.43 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలే కాకుండా, ఆర్జిత సేవల్లో కూడా వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. స్వామివారికి హుండీ, వగపడి ఆర్జిత సేవల ద్వారా లభించే ఆదాయం తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే యాత్రికుల సంఖ్య కూడా 29,135 మంది తగ్గినట్టు నిర్ధారించారు. ఇందుకు అధికారులు చెబుతున్న కారణా లు ఎన్ని ఉన్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా విధించిన ఆంక్షలు విపరీతమైన ప్రభావం చూపించాయి.
రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ ప్రభావం బ్రహ్మో త్సవాలపై గట్టిగా చూపించింది. అక్టోబర్ 21 నుంచి ఆరంభం అయిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజులకు 12.07 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్టు టిటిడి ఇఒ ఐ.వై.ఆర్. కృష్ణారావు తిరుమలలో వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆర్జిత సేవలను రద్దు చేసిన కారణంగా గత ఏడాదితో పోలిస్తే 1.11 కోట్ల రూపాయలకు ఆదాయం పడిపోయింది. వసతి గృహాల ద్వారా 64 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
బహ్మోత్సవాలు ప్రారంభం నుంచి యాత్రికుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా తక్కువగా ఉన్నది. ఆరవ రోజు వరకు అదే పరిస్ధితి కొనసాగింది. ఏడు, ఎనిమిదవ రోజుల్లో మాత్రం యాత్రికుల సంఖ్య, ఆదాయం స్వల్పంగా పెరిగినట్టు టిటిడి నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇందులో ప్రధానంగా హుండీ ద్వారా 3,29,43,000 రూపాయలు, ఆర్జిత సేవా టిక్కెట్లలో 1.11 కోట్లు, వగపడి 1.5 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది.
News Posted: 1 October, 2009
|