బియ్యం నానితే అన్నం రెడీ! భువనేశ్వర్ : గృహిణులకు శుభవార్త... ఇకపై బియ్యాన్ని నానబెడితే చాలు... చిటికెలో అన్నం సిద్ధమౌతుంది. బియ్యాన్ని కాసేపు నానబెడితే చాలు... కుక్కర్, రైస్ కుక్కర్లపై వండి వార్చాల్సిన భారం తప్పుతుంది. ఈ కష్టాల నుంచి తప్పించే బియ్యం రకాన్నిఒరిస్సాలోని కటక్ లో గల కేంద్ర పరిశోధన సంస్థ (సీఆర్ఆర్ఐ) స్థానికంగా పరిశోధించింది. బియ్యాన్ని నానబెడితే కేవలం భోజన సిద్ధమవుతుందని సీఆర్ఆర్ఐ డైరెక్టర్ తపన్ కుమార్ చెప్పారు. ఈ బియ్యానికి 'అప్ఘాన్ బోరా' గా పేరు పెట్టారు. ఈ ధాన్యాన్ని 145 రోజుల వ్యవధిలో పిండించే వీలుంది. హెక్టారుకు 4 నుంచి 4.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ బియ్యాన్ని 45 నిమిషాల పాటు సాధారణ నీటిలో నానబెడితే చాలు. ఇతర రకాలైన బియ్యాన్ని 15 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది. ఈ బియ్యాన్ని 'కోమల్ చావల్'గా అస్సాంలో వ్యవహరిస్తారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఈ ధాన్యాన్ని పండించే అవకాశం ఉందని సిఆర్ఆర్ఐ డైరెక్టర్ పేర్కొన్నారు.
అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలో ఈ బోరా ధాన్యాన్ని పడించవచ్చు. ఇప్పటికే రైతులకు అవసరమైన విత్తనాలు సిద్ధం చేశామని తపన్ కుమార్ చెప్పారు. మూడేళ్ళుగా ఇందులోని పౌష్టిక ఆహార పదార్ధాలపై పరిశోధన చేశామన్నారు. ఇతర దేశాల్లో ఇటువంటి ధాన్యాన్ని పండిస్తుందీ లేందీ తెలియదని చెప్పారు. మహిళలకు చాకిరి తగ్గించే ఈ బియ్యం వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది.
News Posted: 6 October, 2009
|