'గాలి' మార్పుతో వరద న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరద సంభవించడానికి వాతావరణంలో మార్పులే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో సాధారణ స్థాయి కన్నా 600 వందల శాతం అధికంగా వర్షాలు కురవడమే ఈ జల విలయానికి కారణమని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 280 మంది ప్రాణాలు కోల్పోగా, రెండున్నర లక్షల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. లక్షలాది ప్రజలు నిరాశ్రుయలయ్యారు.
వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల్లో కృష్ణా, గోదావరి బేసిన్ లో అనూహ్యమైన భారీ వర్షం కురిసింది. వారం పాటు ఏడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లో నాలుగు వందల మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని అంచనా. భారత వాతావరణ శాఖ రికార్డుల్లో ఈ స్థాయిలో వర్షపాతం గతంలో నమోదు కాలేదని ఆ శాఖ డైరెక్టర్ ఎస్ పీ కిరణ్ చెప్పారు. వర్ష పాతం నమోదను 1901 నుంచి ప్రారంభించారు.
కాగా, సాధారణ వర్షం పాతం కన్నా సగటున ఆరు వందల శాతం, కొన్ని జిన్నాల్లో ఎనిమిది వందల శాతం కురిసిందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గంగా, బ్రహ్మపుత్రలతో పోలిస్తే కృష్ణా, గోదావరి బేసిన్లు సురక్షితమైనవని చెప్పారు. ఈ విషయంలో కూడా వాతావరణంతో సంబంధం ఉందా అన్న విషయాన్ని పరిశోధించాల్సి ఉందని చెప్పారు.
News Posted: 7 October, 2009
|