దేవుడికే దిక్కులేదు హైదరాబాద్ : వరద కష్టాలు మానవుడికే కాదు దేవుడికీ తప్పలేదు. గంగమ్మతల్లి ఆగ్రహం నుంచి రకరకాల రూపాలలో కొలువైన భగవంతుడు కూడా తప్పించుకోలేకపోయాడు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో సామాన్యమానవుని ఇళ్లతో పాటు అనేక దేవాలయాలు కూడా మునిగిపోయాయి. మనిషికే తిండి, నిద్ర కరవైపోయింది. ఇక దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టే దిక్కులేక దేవుడు కూడా ఆకలితో అలమటించిపోయాడు. ఇప్పటికీ వరద తాకిడి ప్రాంతాల్లో అనేక దేవాలయాలు ముంపులోనే ఉన్నాయి. నీటి నుంచి బయటపడిన ఆలయాలను శుభ్రం చేసే దిక్కులేక దుర్గంధపూరితంగా మారాయి. గ్రామాల్లో ఎవో చిన్నా చితకా ఆలయాల సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా కీర్తి గాంచిన దేవాలయాలు కూడా ఈవాళ దీనావస్థలోనే ఉన్నాయి.
మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం మాత్రమే పూర్తిస్థాయిలో బయటపడింది. అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయంలో వరద నీరు ఎక్కడికక్కడ స్తంభిం చిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, కడప, కృష్ణాజిల్లాల్లో నీట మునిగిన ఆలయాలను పునరుద్ధరించడానికి దేవాదాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలవారీ గా వాటి జాబితాను తెప్పించుకుంటోంది. ఈ బాధ్యతను దేవాదాయ శాఖ కమిషనర్ కు అప్పగించింది.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీరాఘ వేంద్రస్వామి వారి మఠం, మహబూబ్‌నగర్ జిల్లాలోని శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయంతో పాటు బీచుపల్లిలోని శ్రీ వీరాంజ నేయస్వామి దేవస్థానం, కడపజిల్లా రాజుపాలెం మండలం కుందూనదికి ఆనుకునే ఉన్న వెల్లాల గ్రామంలోని శ్రీసంజీవరాయ స్వామి ఆలయం వంటి ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన జాబితాను దేవాదాయ శాఖ తెప్పించు కుంటోంది.
నీట మునిగిన ఆలయాలకు వాటిల్లిన నష్టం ఏ పాటిదో అంచనా వేసి.. వాటి జీర్ణోద్ధరణకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆలయాలు జలదిగ్బం ధంలోనే ఉన్నాయి. నీరు పూర్తిగా తగ్గిన తరువాత ఆలయాలను గుర్తించాలని నిర్ణయించింది. జీర్ణోద్ధరణకు అవసరమైన నిధుల ను మంజూరు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 150 ఆలయాలను గుర్తించారు.
News Posted: 9 October, 2009
|