తప్పైన 'వర్ష సూచనలు' న్యూఢిల్లీ : ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో నైరుతిరుతుపవనాల్లో వర్షపాతం అంచనాలు తప్పయ్యాయని, వాస్తవ వర్షపాతానాన్ని మించి - అంచనాలు వచ్చాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అంగీకరించింది. దేశంలో నాలుగు వాతావరణ ప్రాంతాల్లో... ఒక్క దక్షిణ ప్రాంతంలో మినహా సరిగా అంచనా వేయలేకపోయినట్లు చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ కాలంలో మొత్తం 526 వాతావరణ జిల్లాల్లో 311 జిల్లాలు తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 299 జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వర్షాకాల సూచనలను ప్రస్తావిస్తూ కేరళలో వాతావరణ హెచ్చరికలు నిజమయ్యాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు నెలలో దేశంలో వర్షపాతం సూచనలు సరిగా లేవని అంగీకరించింది. కనిష్టమైన వాతావరణ పరిమితులకన్నా వాస్తవిక వర్షపాతం తక్కుగా నమోదైందని స్పష్టం చేసింది.
News Posted: 10 October, 2009
|