ఛానళ్ళు ఇక చాలు! న్యూఢిల్లీ : దేశంలో టెలివిజన్ ఛానళ్ళను అనుమతించే విషయమై 'ట్రాయ్' నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. దేశంలో ఇప్పటికే 500 ఛానళ్ళ ప్రసారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. మరో 100కు పైగా ఛానళ్ళు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పెక్ట్రమ్ లభ్యత ఆధారంగా ఛానళ్ళ సంఖ్యపై పరిమితి విధించే అవకాశం ఉందా అని ట్రాయ్ ని కేంద్రం ప్రశ్నించింది. అంతకుముందు 'సిబాండ్' స్పెక్ట్రమ్ లో కొంతభాగాన్ని సమాచార, ప్రసార శాఖ (ఐ అండ్ బీ) ఖాళీ చేయాలని, వదిలిన భాగాన్ని టెలికాం కంపెనీలు వినియోగించుకుంటాయని టెలీ కమ్యూనికేషన్స్ ( డీఓటీ) విభాగం కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ూడవ తరం స్పెక్ట్ర్ డిసెంబర్ లో వేలానికి రానున్న తరుణంలో అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ లో నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందా అని ఐ అండ్ బీ శాఖ ప్రశ్నించింది. ఈ మేరకు టెలికామ్ నియంత్రణ అధికార సంస్థ (ట్రాయ్) ఛైర్మన్ జెఎస్ శర్మకు ఐ అండ్ బీ కార్యదర్శి రఘు మీనన్ రాసిన లేఖలో అనేక అంశాలు లేవనెత్తారు. దేశంలో ఛానళ్ళను అనుమతించే విషయమై ప్రశ్నించగా, తాము ట్రాయ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికాసోనీ చెప్పారు. కాగా, కొంతమంది ఎంపీలు... స్థానిక ఛానళ్ళ తీరుపైనా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. కాగా, కేబుల్ ఆపరేటర్లు నిషేధించిన, రిజిస్టర్ కాని ఛానళ్ళు ప్రసారం చేస్తున్నట్లుగా హోం మంత్రి చిదంబరానికి అంబికాసోని ఫిర్యాదు చేశారు.
News Posted: 13 October, 2009
|