వెయ్యి కోట్లు 'కృష్ణా'ర్పణం విజయవాడ : ఇటీవలి వరదల వల్ల కృష్ణాజిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల మేరకు నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 16 మండలాల్లోని 95 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని కాల్వ గట్లకు గండ్లు పడటం వల్ల 350 కోట్ల రూపాయలు నష్టమైందని ఇరిగేషన్ శాఖ పేర్కొంది. తక్షణ మరమ్మతుల కోసం 7.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. వరదలతో సుమారు 408 కిలో మీటర్ల మేర రహదారులు జిల్లాలో దెబ్బతిన్నాయని, ఈ నష్టం మొత్తం 62 కోట్ల రూపాయల మేరకు ఉంటుందని ఆర్ అండ్ బీ శాఖ ప్రకటించింది. ఆయా రహదారులను మరమ్మతులు చేయాడనికి 8 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా అందించాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయరంగంలో జిల్లాలోని 70 వేల ఎకరాల్లో 200 కోట్ల విలువైన పైర్ల నష్టం సంభవించిందని తెలుస్తోంది. ఇంకా సమగ్ర సర్వే పూర్తి కాలేదు. పంచాయతీరాజ్ శాఖకు కూడా 250 కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగింది. దీనికి తోడుగా మత్స్య శాఖ విభాగం కూడా తీవ్రంగా నష్టపోయిందని తెలుస్తోంది.
News Posted: 16 October, 2009
|