మావోలపై సెంట్రల్ కమాండ్ హైదరాబాద్ : మావోయిస్టులను తుదముట్టించేందుకు వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలతో కలిసి సెంట్రల్ ఆపరేషన్స్ కమాండ్ ను ఏర్పాటు చేసింది. చత్తీస్ ఘడ్, ఒరిస్సా, జార్కాండ్ రాష్ట్రాల్లో విస్తరించిన దట్టమైన దండకారణ్యంలో దాగి ఉన్న మావోయిస్టును పార్టీ శిబిరాలకు సమీపంలో పారా మిలిటరీ బలగాలను దించేందుకు వీలుగా భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. దీని నిమిత్తం ఐఎఎఫ్ ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కు ఒక గ్రూప్ కెప్టెన్ ను నియమించింది. ఇతను ఐఎఎఫ్ తరఫున కమాండర్ గా పని చేస్తారు. దేశం మొత్తం మీద మావోయిస్టు కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సెంట్రల్ ఆపరేషన్స్ కమాండోలో భారత వైమానిక దళం తరఫున గ్రూప్ కెప్టెన్ కమాండర్ గా, సభ్యులుగా ఉంటారు. ఈ కమాండోలో భారత వైమానిక దళం సభ్యుడు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిఆర్ పి ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్స్ సభ్యులుగా ఉంటారు. గతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు ఆపరేషన్స్ నిర్వహించేందుకు సరిపోతాయని కేంద్ర హోమంత్రిత్వ శాఖ భావించింది. కాని మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలన చేసేందుకు నాలుగైదు రాష్ట్రాల పరిధిలో ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంది. దీంతో భారత వైమానిక దళం హెలికాప్టర్లను కూడా వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
అంతరంగిక భద్రతకు ముప్పు కలిగిస్తున్న మావోయిస్టులను ఏరిపారేసే విషయంలో ఇంతకాలం వైమానిక దళం సేవలను వినియోగించుకోవాలా వద్దా అనే సంశయం కేంద్రానికి ఉండేది. అలాగే భారత వైమానిక దళం హెలికాప్టర్ సేవలను రవాణా, ఆహార పదార్థాల చేరవేతకు మాత్రమే వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ హెలికాప్టర్లపై మావోయిస్టులు భూమి పై నుంచి కాల్పులు, రాకెట్ లాంచర్ల ద్వారా దాడి జరిపితే ఆత్మరక్షణార్ధం దాడికి దిగేందుకు భారత వైమానిక దళం కేంద్రం అనుమతి కోరినట్లు తెలిసింది. 1960వ దశకంలో నాగాలాండ్ లో మిజో నేషనల్ ఫ్రంట్ గెరిల్లాలు తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా వారిని అణచివేసేందుకు భారత వైమానికి దళం సేవలను కేంద్రం అనుమతి కోరినట్లు తెలిసింది. 1960వ దశకంలో నాగాలాండ్ లో మిజో నేషనల్ ఫ్రంట్ గెరిల్లాలు తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా వారిని అణచివేసేందుకు భారత్ వైమానిక దళం సేవలను కేంద్రం ఉపయోగించింది. తమపై మావోయిస్టులు దాడిచేస్తే మట్టుబెట్టేందుకు వీలుగా రూల్స్ ఆవ్ ఎంగేజ్ మెంట్ కింద అనుమతిని వైమానిక దళం కేంద్రాన్ని కోరినట్లు పోలీసులు వర్గాలు ధృవీకరించాయి. ఎంఐ పేరు కలిగిన 17 హెలికాప్టర్లను భారత వైమానిక దళందండకారణ్యం పరిసరాల్లో ఆపరేషన్స్ లో దించింది. ఇందులో గరుడ కమాండర్ డోన్ అంటారు. ఇప్పటికే మూడు వేల వరకు భారతవైమానిక దళ సిబ్బందిని మహారా, ఒరిస్సా, చత్తీస్ ఘడ్, జార్కాండ్ రాష్ట్రాలకు తరలించారు. బహుశా ఈ నెలాఖరు లేదా వచ్చేనెల నుంచి ఈ భూ గగన తల మార్గాల ద్వారా ఏక బిగిన దాడులు దంచడకారణ్యంపై ప్రారంభమయ్యేందుకు అవకాశాలున్నాయని స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి.
News Posted: 16 October, 2009
|