గాలిలో ప్రయాణం! హైదరాబాద్ : మసాబ్ ట్యాంక్ నుంచి ఆరాంఘర్ కు కేవలం 10 నిమిషాల్లో చేరగలరా! అంటే అవుననే చెప్పాలి. సోమవారం పీవీ నరసింహారావు ఎలివేటర్ ఎక్స్ ప్రెస్ వేను ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించిన విషయం విదితమే. మొత్తం 11.6 కిలోమీటర్ల దూరం నిర్మితమైన ఈ ప్లై ఓవర్ దేశంలోనే పొడవైనది. మూడేళ్ళ వ్యవధిలో నిర్మించిన ఈ వంతనె ఆరంఘర్ వద్ద నేషనల్ హైవే 7 లో కలుస్తుంది. సరోజినిదేవి ఆస్పత్రి వద్ద ఈ వంతెన పైనే ప్రవేశిస్తే ఆరాంఘర్ చేరడానికి కేవలం 10 నిమిషాలు చాలు! దీనివల్ల డ్రైవింగ్లో చికాకులు తగ్గడంతో పాటు 20 నిమిషాలు వ్యవధి తగ్గుతుంది. ఇంధనం కూడా మిగులుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రోశయ్య మాట్లాడుతూ జంటనగరాల్లో మరిన్ని ఫ్లై ఓవర్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తామని చెప్పారు.
News Posted: 20 October, 2009
|