దొంగను పట్టించిన కాళిక పాటియాలా : దోపిడీ దొంగలు తాము దోచిన దాంట్లో... కాళికా దేవికి వాటా ఇచ్చి సంతృప్తి పరుస్తారని కథల్లో విన్నాం. కానీ పాటియాలలోని కాళీమాత మాత్రం 'దోపిడీ దొంగల వాటాను తిరస్కరించడమే కాదు... దొంగను పోలీసులకు పట్టించింది. సెప్టెంబర్ 24వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. అందులో విశేషమేముంది! కానీ... తరువాత నాలుగు రోజులకు కుర్తా, ఫైజామా, నొసట తిలకధారణతో ఉన్న పెద్ద మనిషి ఒకరు కాళికా ఆలయంలోని హుండీలో నగదను వేశారు. దాదాపు 3.5 లక్షల రూపాయలు లేదా దోచిన మొత్తంలో 10వ శాతం వాటాను' భక్తుల జయజయ నినాదాల మధ్య హుండీలో 'కానుక'గా సమర్పించారు. దోచిన సొమ్మును 'మాట పొల్లుకుండా దేవతకు సమర్పిస్తున్నానని సంతోషించిన ఆ 'దొంగ' భక్తుడు... 'ఈ తంతు'నంతా వ్లోబేడ్ టీవీలో రికార్డు జరగుతున్న విషయాన్ని గమనించలేదు. ఇదే... అతని కొంప ముంచింది. పోలీసులకు ఆనాటా... ఈ నోటా హుండీలో వేసిన కానుక సంగతి తెలియడంతో తీగాలాగారు. డొంక కదిలింది. కానుక వేసిన హితేష్ శర్మ అలియాస్ విక్కీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు 'మర్యాద'లతో నిజం బయటపడింది. ఈనెల 11న ఆరుగురు సభ్యులున్న ముఠాను అరెస్ట్ చేశారు. 'దొంగ' కానుకను తిరిగి ఇస్తామని ఆలయ యాజమాన్యం తెలిపింది. అయితే... పోలీసులు ఇంకా స్పందించలేదు.
News Posted: 21 October, 2009
|