గూగుల్ లోగోకు కొత్తకళ! న్యూఢిల్లీ : గూగుల్ ఇండియా సెర్చ్ ఇంజిన్ హోం పేజి 'లోగో' కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. ముఖ్యంగా పండగరోజులు, జాతీయ సెలవు దినాల్లో ఈ మేరకు 'లోగో ధారణ' జరుగుతుంది. చిన్నారులు చిత్రీకరించిన రేఖా చిత్రాలతోనే ఈ మార్పు జరుగుతుంది. 'నా భారత్' పేరిట ప్రత్యేక 'లోగో'లను ఈ విధంగా ఏర్పాటు చేస్తామని గూగుల్ ఇండియా ప్రకటించింది. 'డూడుల్ ఫర్ గూగుల్' పేరిట పోటీని దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. 'భారత్ వారికి (పిల్లల) దృష్టిలో ఎలా ఉందో. వారి భావనకు అనుగుణంగా రేఖాచిత్రంగా భారత్ గురించి చెప్పాలి' అని గూగుల్ ఇండియా కన్య్సూమర్ హెడ్ అరవింద్ దేశికన్ చెప్పారు. ఈ పోటీలో పాల్గొనే చిన్నారులు భారత్ కు చెందిన ఏ అంశానైన్నా చిత్రించవచ్చు. అది వ్యక్తిగతమైనా కావచ్చు. ఈ అంశం విషయంలో పరిమితులను పోటీ నిర్వాహకులు విధించలేదు. 'క్రికెట్ అయినా సరే, తాజ్ మహల్, అమితాబ్, మహాత్మాగాంధీ, భరతనాట్యం, ఆర్యభట్టు... ' ఇలా యువజనం తమ దృష్టిలో భారత్ ను రేఖాత్మకంగా చిత్రిస్తే చాలునని దేశికన్ వివరించారు.
News Posted: 26 October, 2009
|