మందు కిక్కుతో పంటలు కోయంబత్తూరు : ఇది చదవడానికి లేదా వినడానికి హాస్యాస్పదంగా ఉండవచ్చు. కాని నిజ్ఝంగా నిజం. తమిళనాడు ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రాంతంలోని రైతులు తెగుళ్ళ నివారణ, పంటల అధిక దిగుబడుల కోసం స్థానికంగా దొరికే బ్రాందీని లేదా విస్కీని ఉపయోగిస్తున్నారు.
అరటి, కాలీఫ్లవర్, ఉల్లి, క్యాబేజి పంటల దిగుబడిని పెంచుకునేందుకు తాను అత్యంత చౌక అయిన బ్రాందీ 'మానిటర్'ను, 'జిబ్బరెలిక్ ఏసిడ్'తో పాటు వాడినట్లు నటరాజ్ అనే స్థానిక రైతు 'యుఎన్ఐ' విలేఖరితో చెప్పాడు. అతను భవానీ నది, మంచినీరు, భూగర్భ జల ప్రాజెక్టు విభాగం కార్యదర్శి కూడా. ఈ ప్రాంతంలోని 100 మందికి పైగా రైతులు ఈ మిశ్రమాన్ని వాడుతున్నారని కూడా అతను తెలియజేశాడు.
రైతులు సాధారణంగా 30 ఎంజి జిబ్బరెలిక్ ఏసిడ్ ను 12 లీటర్ల నీటిలో కలుపుతుంటారు. కాని నీటిలో ఏసిడ్ కరిగిపోదు కనుక ఆల్కహాల్ తో సమ్మిళితం చేయవలసిందిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు. అయితే, ఆల్కహాల్ కొనడం కష్టం కనుక రైతులు ఏసిడ్ లో కలిపేందుకు స్థానిక బ్రాందీని లేదా విస్కీని కొంటున్నారు. దీనితో పంటల దిగుబడులు పెరిగాయి.
ఇలా చేయడం మంచిది కాకపోయినప్పటికీ, ఆల్కహాల్ ను సంపాదించడం కష్టమైనందున రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కాయగూరల విభాగం సైంటిస్ట్ ఎల్. పుహళేంది చెప్పారు.
News Posted: 4 November, 2009
|