హీరోయిన్లకు లక్షలిచ్చిన కోడా ముంబై : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా బాలీవుడ్ భామలకు భారీగా డబ్బులిచ్చాడని తేలింది. కోడానుంచి ఇద్దరు బాలీవుడ్ నటీమణులు నగదు స్వీకరించినట్లు ఆదాయపు పన్ను (ఐటి), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం వారిద్దరిపై ఆ రెండు విభాగాలు ఒక కన్ను వేశాయి. రమారమి రూ. 4000 కోట్ల మేరకు సంపదను అక్రమంగా ఆర్జించారనే ఆరోపణలపై కోడాపై ఐటి శాఖ, ఇడిలు దర్యాప్తు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో రూ. 1500 కోట్ల మేరకు ముంబైకి చెందిన బాలాజీ గ్రూప్ హవాలా లావాదేవీల ద్వారా బదలీ చేసినట్లు తెలుస్తున్నది.
బాలీవుడ్ నటీమణులిద్దరిలో ఒకరికి రూ. 40 లక్షలు చెల్లించగా, రెండవవారు రూ. 10 లక్షలు స్వీకరించినట్లు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ముంబైలోని కోడా ఏజెంట్లు వారిద్దరికీ డబ్బు చెల్లించినట్లు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఆ వారిద్దరికీ క్రితం సంవత్సరం వేర్వేరు సందర్భాలలో ముంబైలో నగదు రూపంలో ఆ డబ్బు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. 'ఆ నటీమణులిద్దరికీ డబ్బును, అదీ నగదు రూపంలో ఎందుకు చెల్లించారో తేల్చుకునేందుకు కోడా నుంచి, ఆయన సహచరుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను మేము క్షుణ్ణఁగా పరిశీలిస్తున్నాం' అని ఢిల్లీలోని ఐటి సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
ఆ నటీమణులిద్దరిలో ఒకరిని 2008లో ఝార్ఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా నియమించడానికి కోడా ప్రయత్నించారు. ఝార్ఖండ్ రాష్ట్రం గురించి పెట్టుబడుల గమ్యస్థానంగా ఆమెతో ప్రచారం చేయించాలని కోడా అనుకున్నారు. కాని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన కారణంగా ఆ యోచనను విరమించుకున్నారు.
కోడా ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం వంటి అధికారిక అవసరాల కోసం ఆ నటీమణులిద్దరికీ ఈ చెల్లింపులు జరిపారా అనే విషయాన్ని, అలా అయితే నగదు రూపంలోనే ఎందుకు చెల్లింపులు జరిపారు అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ ప్రాజెక్టులలో కోడా పెట్టుబడులపై కూడా ఐటి శాఖ, ఇడి దర్యాప్తు సాగిస్తున్నాయి. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున కోడా మదుపు పెట్టిన ప్రాజెక్టుల వివరాల వెల్లడికి అధికారులు నిరాకరించారు.

News Posted: 11 November, 2009
|