మా నాన్న అమ్మేశాడు: కసబ్ వాషింగ్టన్ : డబ్బుల కోసం మా నాన్నే నన్ను లష్కరే తొయిబా తీవ్రవాదులకు అమ్మేశాడని కసబ్ చెప్పాడు. హెచ్ బివో చానల్ ఆదివారం ప్రసారం చేసిన టెర్రర్ ఇన్ ముంబయి అనే డాక్యుమెంటరీలో కసబ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడుచ. ముంబయి మారణహోమానికి తెగబడ్డ పాకిస్తాన్ టెర్రరిస్టుల్లో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుపడ్డాడు. వీధుల్లో మిఠాయిలు అమ్ముకుని తమను పోషించే తన తండ్రి మంచి బతుకు కోసం తనను అమ్మేశాడని ఆ సంభాషణలో ఉంది. కొన్ని వేల రూపాయలు ఇచ్చారని, కానీ అవి తన తండ్రి తీసేసుకున్నాడని చెప్పాడు. ఎంత మొత్తం ఇచ్చారో మాత్రం తనకు తెలీదని అన్నాడు. కొందరు ప్రజలు సంపన్నులని, మనం కూడా అలాగే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పేదరికాన్ని అనుభవించ వద్దని, నువ్వు కూడా వారిలాగే ఉండాలని తండ్రి తనకు చెప్పాడని కసబ్ తెలిపాడు. తీవ్రవాద సంస్థలో మూడు నెలలపాటు శిక్షణ పొందానని కసబ్ చెప్పాడు
News Posted: 16 November, 2009
|