మునీరా 'క్యాట్' మారథాన్ ముంబై : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులే సాధారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిఎటి - క్యాట్)కు హాజరవుతుంటారు. కాని మునీరా లోఖండ్ వాలా ఈ కోవలోకి రాదు. 1999లో ఐఐఎం కలకత్తా నుంచి గ్రాడ్యుయేట్ అయిన 32 సంవత్సరాల లోఖండ్ వాలా గడచిన ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 'క్యాట్'కు హాజరవుతూనే ఉంది.
అంతే కాదు రెండు సార్లు నూటికి నూరు శాతం మార్కులు కూడా ఆమె సాధించింది. 2005, 2008 సంవత్సరాలలో ఆమెకు 100 శాతం మార్కులు వచ్చాయి. ఇతర పేపర్లలో ఆమెకు 99.99 శాతం మార్కులు లభించాయి. 'క్యాట్' కోసం విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సొంతంగా ఒక ఇన్ స్టిట్యూట్ ను నడుపుతున్న లోఖండ్ వాలా 'నిరంతర పరిణామ క్రమంలో ఉంటున్న పరీక్ష గురించి అవగాహన పొందేందుకు' ప్రతి సంవత్సరం పరీక్షకు హాజరు కావడం తనకు ఇష్టమని చెప్పింది. మునీరా లోఖండ్ వాలా ఇన్ఫోసిస్ తో సహా రెండు సాఫ్ట్ వేర్ సంస్థలలో పని చేసి తరువాత అధ్యాపకురాలిగా జీవితం సాగించడానికి నిశ్చయించుకుంది. సొంత సంస్థను ఏర్పాటు చేసే ముందు ఆమె రెండు ప్రముఖ సిఎటి కోచింగ్ సంస్థలలో పని చేసింది.
News Posted: 1 December, 2009
|