కాంచీపురంలో కామ పూజారి
చెన్నై : వెయ్యి దేవాలయాల నిలయంగా, పవిత్రతో అలరారే ఆ పట్టణం అలకల్లోలమైంది. దేవాలయం అశ్లీల శృంగారానికి వేదికైందని, సాక్షాత్తూ పూజారే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి ప్రజలు నిశ్చేష్టులయ్యారు. 35యేళ్ల పూజారి దేవనాథం గుడిలోనే మహిళల మానాలోతో ఆటలాడుకున్నాడని, పరమ పవిత్రంగా భావించే మహేశ్వరర్ దేవాలయంలోనే తన వికార చేష్టలకు పాల్పడ్డాడని తెలిసి నెలరోజులు దాటినా ప్రజలు మాత్రం ఇంకా తేరుకోలేదు. కాంచీపురం పేరు చెబితేనే దేశవ్యాప్తంగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కాంచీపురం పట్టు చీరలు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచాయి. అలాంటి పట్టణానికి ఇప్పుడు అప్రదిష్టను తెచ్చిపెట్టాడు పూజారి దేవనాథ్.
దేవాలయంలో శృంగారం జరుపుతున్న దృశ్యాలున్న వీడియో సిడీలను పోలీసులు నవంబరు మొదటి వారంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సిడీలు పట్టణంలో హట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాంతో మీడియా రంగంలోకి దిగి వీడియో దృశ్యాల్లో ఉన్న పూజారిని గురించి పుంఖానుపుంఖానులుగా కథనాలను ప్రచురించాయి. సమాజంలోని వివిధ సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన దాదాపు ముఫ్పై మంది మహిళలతో పూజారి దేవనాథ్ కు లైంగిక సంబంధాలు ఉన్నాయని బయటపెట్టారు. ఇప్పుడు అనేక మంది మహిళలు తమపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడని, దానిని సెల్ ఫోనులో చిత్రీకరించి ఆతరువాత కూడా తమపై అఘాయిత్యాన్ని కొనసాగించాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తమను బలవంతంగా దేవాలయానికి రప్పించి తన కోర్కెను తీర్చుకునేవాడని వివరిస్తున్నారు.
ఎదో అశ్లీల చిత్రాల కేసుగా పరిగణించి కేసు పెట్టిన పోలీసులు దానిని తాజాగా జిల్లా నేరపరిశోధన శాఖకు అప్పగించారు. అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్ తదితర నేరాలపై కేసు నమోదు చేసి పూజారి దేవనాథ్ ను అరెస్టు చేసి వెల్లూరు జైలుకు రిమాండ్ లో తరలించారు. సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఈ పట్టణంలో ఇప్పుడు ఈ సంఘటన అనేక కుటుంబాలను తలదించుకునేలా చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మహేశ్వరర్ ఆలయం పక్కనే నివశించే ఒక స్కూలు టీచరు భార్యను ఒకసారి ఈ పూజారి బలవంతంగా గుడిలోకి లాక్కుపోయి అత్యాచారం చేశాడు. దానిని సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. తనకు సహకరించకపోతే ఈ దృశ్యాలను భర్తకు చూపిస్తానని పూజారి బెదిరించేవాడని, దాంతో అతనికి అనేక సార్లు లొంగిపోయానని ఆ మహిళ పోలీసులకు వివరించింది. ప్రత్యేక పూజ చేస్తానని, పాలు తీసుకుని గుడికి రావాలని ఇంటికి వచ్చి మరీ చెప్పి వెళ్ళేవాడని, దేవాలయంలోనే పాపానికి ఒడిగట్టేవాడని ఆమె చెప్పింది. దేవాలయానికి వచ్చే మహిళలకు, బాలికలకు ప్రత్యేక ప్రసాదాలను పంచిపెట్టడం తాను చాలా సార్లు గమనించానని మరో వ్యక్తి చెప్పాడు. పట్టణంలో చాలా మంది మహిళలను దేవనాథ్ ఈ విధంగా లోబరుచుకున్నాడని పోలీసులు కనుగొన్నారు. తన ఘనకార్యాలు చిత్రీకరించిన సెల్ ఫోన్ ను స్థానికంగా ఉండే వీడియో షాపులో ఇచ్చి వాటిని సిడీలుగా మార్చాడని, వాటిని కాంచీపురం , చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసాడని పోలీసులు తెలిపారు.
News Posted: 3 December, 2009
|