శాటిలైట్ కిల్లర్ తిరువనంతపురం : భారత దేశ రక్షణ సంపద అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం చేరబోతోంది. గగనతలంలో శత్రుసేనల ఎత్తులను చిత్తు చేసే యాంటీ శాటిలైట్ ను అతి త్వరలో భారత్ రూపోందించబోతోంది. ఈ తరహ శాటిలైట్ ల రూపకల్పనలో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న చైనాకు ఇండియా ఇపుడు సరికొత్త సవాల్ విసురుతోంది. కేరళలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ వేదికగా యాంటీ శాటిలైట్ సిస్టమ్ ను రూపొందిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఆకాశమార్గాన శత్రు దేశాలు మన దేశంపైకి అత్యంత విధ్వంసక శాటిలైట్ ఆయుధాలను ప్రయోగిస్తుంటాయి. వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టగల సామర్ధ్యం చాలా దేశాలకు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
అయితే చైనా మాత్రం మూడేళ్ల క్రితం యాంటీ శాటిలైట్ ను రూపోందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే అది భూతలంపై నుండి ఆకాశయాన శాటిలైట్ లను లక్ష్యంగా చేసుకోని ఛేదిస్తుంది. చైనా చేసిన ఈ ప్రకటనపై ప్రపంచ దేశాలన్నీ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసాయి. సోవియట్ యూనియన్ తో యుఎస్ జరిపిన యుద్ధం స్టార్ వార్ మిగిల్చిన విషాదాంతాన్ని చైనా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో బారత్ ఆకాశయానంలోనే ఈ యాంటీ శాటిలైట్ ను రూపోందిస్తున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో భారత డీఆర్ డీఓ డైరక్టర్ జనరల్ వి. కె. సరస్వత్ సోమవారం వెల్లడించారు. అయితే ఈ యాంటీశాటిలైట్ పరిజ్జ్ఞానాన్ని తాము ఎప్పుడూ ప్రయోగించబోమని, అలాగే పరీక్షించబోమని, కేవలం అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
News Posted: 4 January, 2010
|