3ఇడియట్సే ఆదర్శం కోల్ కతా : కాలేజీకి కొత్తగా వెళ్లే స్టూడెంట్స్ కి ఇడియట్స్ తో కలవకు..వారితో స్నేహం చేయోద్దు.. అసలు వారిని చూడొద్దని పూర్వం హితోక్తులు చెప్పేవారు. కానీ ఇపుడు కాలం మారింది. ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు ఇడియట్స్ ని చూడమంటున్నారు. అంతేకాకుండా వారిని చూసి ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు కూడా నేర్చుకోవాలని సాక్షాత్తూ మేధావులే సలహాలిస్తున్నారు. అంత గోప్ప ఇడియట్స్ మరెవరో కాదు మన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతని సహచరులు. క్లాస్ రూమ్ పాఠాలపై బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 3 ఇడియట్స్ ఇచ్చిన సందేశం విద్యావేత్తలను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది మరి. విడుదల కావడంతోనే దేశంలోని ఏదో ఒక మూల ఆద్యంతం వివాదాల్లో ఇరుక్కుంటున్న ఈ సినిమా సందేశం ఎంతో ఆదర్శనీయమని విద్యావేత్తలు భావిస్తున్నారు. దేశంలో కుప్పలు తెప్పలుగా ఎక్కడక్కడ వెలసిన ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ చిత్ర సందేశం తగిన గుణపాఠంగా వారు అభివర్ణిస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలు భోదించడం కంటే ప్రాక్టికల్ ఆనుభవంతోనే నైపుణ్యం సాధిస్తారని సినిమాలో హీరో అమీర్ ఖాన్ రాంఖో పాత్ర సందేశమిస్తోంది. ఈ సందేశాన్నే అనుసరించాలని బెంగాల్ వర్శిటీ ఉవ్విళ్లూరుతుండగా, ఐఐటీ మేధావులు కూడా ఫాలో అవుతామంటున్నారు. సినిమాలో హీరో అమీర్ ఖాన్ పాఠ్యాంశాలకు సంభందించిన యంత్ర పరికరాలతో క్లాస్ రూమ్ లోకి వెళ్లగా, పాఠ్యపుస్తకాలను అనుసరించకుండా, పరికరాలను తెచ్చినందుకు టీచర్ అమీర్ ను బయటకు వెళ్లకొడతాడు. అయితే అమీర్ టీచర్ తో వాగ్వాదానికి దిగి తగిన గుణపాఠం చెబుతాడు.
అయితే ప్రాక్టికల్ పరిజ్జ్ఞానం లేకుండా పాఠ్యాంశాలను మాత్రమే నూరిపోస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు అమీర్ ఇచ్చిన సందేశాన్ని చూసైనా తమ పంథాను మార్చుకోవాలని దేశంలో బాలల పాఠ్యపుస్తకాల రూపకర్త రాజగోపాలన్ వ్యాఖ్యనించారు. విద్యార్థులను పాఠ్యాంశాలను బట్టీ యంత్రాల్లా తయారు చేయకుండా తగిన నైపుణ్యం అందించాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ పాఠ్యాంశాల భోదనా పద్ధతులను మార్చుకోవాల్సి ఉంది. కేవలం సెమిస్టర్ మార్కులే ప్రమాణికం కాకుండా. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సన అవసరం ఉందని బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ అజయ్ రాయ్ వ్యాఖ్యానించారు. వర్శటీలు 3 ఇడియట్స్ సందేశం అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
News Posted: 5 January, 2010
|