'సైక్లిస్టులకు ప్రత్యేక రోడ్లు' బెంగళూరు : కారు లో షికారు చేస్తూ ఊరంతా చక్కర్లు చేయాలన్నది సగటు భారతీయులందరూ రోజూ కంటున్న కలే. ఈ రోజుల్లో హైస్కూల్ కి వెళ్తున్న కుర్రాడికి సైతం బైక్ కావాల్సిందే. ఇక కాలేజీకి వెళ్తే కారులో షికారు చేయ్యాల్సందే. మరి సగటు జీవుల కలలే ఈ రేంజ్ లో ఉంటే, ఇంగ్లాండ్ లో శాస్త్రవేత్తగా పని చేస్తూ, నోబెల్ ఆవార్డును సాధించి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన వ్యక్తి ఆశలు టాటా, బిర్లాల తరహాలో సొంత హెలికాప్టర్ , విమానాల్లో విహరిస్తున్నట్లుంటాయి.. కానీ, రసాయిన శాస్త్రంలో పట్టు సాధించి, దానిని నిగ్గు తేల్చి ఏకంగా నోబెల్ అవార్డ్ ను సాధించిన భారత సంతతి వ్యక్తి వెంక్రట్రామన్ రామకృష్ణన్ మాత్రం తనకు కారు వద్దు, సైకిల్ ముద్దంటున్నారు. సొంత కారు కూడా కొనుక్కోని ఆయన తనకిష్టమైన సైకిల్స్ ని మాత్రం నాలుగు కొనుక్కోన్నారు. ఇంగ్లాండ్ వీధుల్లో కారులకు టాటా చెప్పి సైకిల్ తొక్కుతూనే ఆయన తన పనులు చక్కబెట్టుకుంటారంటే వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం.
ఇండియా పర్యటనలో ఉన్న ఆయన బెంగళూరులో రైడ్ ఎ బైస్కిల్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఇష్టాగోష్టి జరిపారు. సైకిల్ పై తనకున్న మక్కువపై వారితో ముచ్చటించారు.అలాగే యాంత్రిక వాహనాల సౌలభ్యం కోసం ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ వే లు నిర్మించడమే అభివృద్ధి అని భావిస్తున్న భారత ప్రభుత్వం సైక్లిస్ట్ ల ప్రయోజనాలు పట్టించుకోకపోవడంపై వెంకట్రామన్ రామకృష్ణన్ వారితో మాట్లాడుతూ, కాస్త పెదవి విరిచారు.కారులతో కిటకిటలాడుతున్నభారతీయ రోడ్ లపై సైకిల్ తొక్కడం అసాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. బాలలు సైకిల్ పై మక్కువ పెంచుకునేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
కారు అత్యంత వేగవంతమైన వాహనం అయినప్పటికీ ఇంగ్లాండ్ లో తన స్నేహితులంతా కారు లపై ఒక ప్రాంతానికి బయలుదేరితే తాను సైకిల్ పై వెళ్లినా వారి కంటే 20 నిమిషాలు ముందుగా గమ్యస్థనానికి చేరుకున్నానని అయన తన అనుభవాన్ని చెప్పారు. ఆయితే సైక్లిష్ట్ లకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాక్ లు నిర్మించాలన్న రైడ్ ఎ బైస్కిల్ ఫౌండేషన్ డిమాండ్ కు ఈ నోబెల్ విన్నర్ కూడా తన మద్దతును అందించారు.
News Posted: 8 January, 2010
|