వాలంటైన్ శ్రీకృష్ణుడు చెన్నై :పాశ్చాత్య విశృంఖల ధోరణికి ప్రతిబింబంగా వాలంటైన్ డేను భావించి, ఆ రోజు ప్రేమికుల బహిరంగ సంచారాన్ని నిరోధించే శివసేన, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా ఈ సారి అడ్డు చెప్పలేవేమో! ఎందుకంటే హిందూ, పాశ్చాత్య ధోరణులను మిళితం చేసి వాలంటైన్ శ్రీకృష్ణుడి అవతారాన్ని సృష్టించాడో ఆధునిక భక్తుడు. అందరికీ ప్రేమ దేవత, దేవుళ్లు ఉన్నారు. హిందువులకు ప్రేమికుల దేవుడుగా శ్రీకృష్ణుడిని ఆరాధాస్తుంటారు. 16 వేల మంది గోపికలతో ప్రేమ లీలలు సాగించిన ఘనత ఆయనకే సొంతం కాబట్టి అంతా ఆయన్నే కొలుస్తుంటారు. ఇక క్రైస్తవులుకు వాలంటైన్ ను అపర ప్రేమికుడుగా పేర్కొంటూ చారిత్రక కీర్తి ఉంది. మరి గొప్ప ప్రేమికులుగా నిలిచిని వీరద్దిరినీ ప్రేమికులు కొలిచే ఆలయం మాత్రం లేకుండా పోయింది. అయితే శ్రీకృష్ణుడికి లెక్కకు అందని ఆలయాలున్నప్పిటికీ ప్రేమికుల దేవుడులా మాత్రం ఇప్పటివరుకు ఎక్కడా ఆలయాలు లేవు. వాలంటైన్ కు అసలే లేవు. అతిత్వరలోనే ఈ ఆలయాల లోటు తీరబొతోంది. ఇకపై నిత్యం ఈ ప్రేమ దేవుళ్లను కొలిచేందుకు వీలుగా ఆలయం నిర్మాణమవుతోంది.
వాలంటైన్ రూపానికి శ్రీకృష్ణుడుని తలపించేలా అలంకరణ చేస్తారు. వాలంటైన్ కు కృష్ణుడుకి ఉన్నట్లే వేణువు జత చేసి, పక్కనే కృష్ణుడు సంకేతమైన గోవును కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సరికొత్తగా వాలంటైన్ శ్రీకృష్ణుడుని రూపొందుతున్నాడు. ఈ మేరకు సరికొత్త ప్రమదేవుడికి ఏకంగా ఆలయమే నిర్మితమవుతోంది. చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వెల్లూరు సమీపంలోని షోలింగర్ లో ఈ ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. చైన్నైలో హోటళ్ల వ్యాపారం చేసే జగన్నాథ్ అన్ వ్యాపారి ఈ ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 36 చదరపు అడుగుల విస్తీర్ణంలో12 అడుగల ఎత్తుతో ఆలయాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అలాగేవాలంటైన్ శ్రీకృష్ణుడు, రాథాలు కలిసి వేణువు ఆలపిస్తుండగా ఆ పక్కనే గోవులు చేరినట్లుగా ఉండేలా మార్బుల్స్ తో ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2 లక్షల రూపాయలను వ్యయం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత సందర్శకులు ఈ వాలంటైన్-శ్రీకృష్ణ విగ్రహాలను తిలకించడంతో పాటుగా తాకే అవకాశం ఉంటంది. సాధారణంగా హిందూ ఆలయాల్లో దేవతా విగ్రహాలను తాకే అవకాశం లేదు. అయితే ఈ ఆలయంలో మాత్రం ఎటువంటి నియమ నిబందనలకు అస్కారం లేదని, తాక కుండే ప్రేమ ఎలా పుడుతుందని ఆలయ నిర్మాణం చేస్తున్న జగన్నాథ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆలయాన్ని ఈ వాలంటైన్స్ డే నాటికే పూర్తి చేసి దర్శనార్థం సిద్ధం చాయలాని యోచించినా, కుదరలేదని, ఏప్రిల్ మాసం నాటికి మొత్తం సిద్ధమవుతున్నదని ఆయన తెలిపారు. అయినా కృష్ణుడికి మరేం ఫర్వాలేదు 16,000 మంది గోపికలున్నందున ఆయనకు ప్రతీ రోజూ ప్రేమికుల దినోత్సవమేనని చమత్కరించారు జగన్నాధం. అయితే ఈ ఆలయం పూర్తయితే ఇక్కడ వాలంటైన్ దినోత్సవాన్ని శివసైనికులు అడ్డుకోవడం కష్టమే మరి.
హిందూదేవతల రూపాలను మార్చడం ఇపుడు కొత్తకాదు. కొల్ కతాలో భారతజట్టు ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ గెలిచిన సందర్భంగా వినాయకుడుని సరికొత్తగా రూపోందించి ఆలయం నిర్మించారు. 2001లో రామకృష్ణన్ అనే ఓ కంపనీ సెక్రటరీ వినాయకుడు క్రికెట్ ఆడుతున్నట్లుగా తన అపార్ట్ మెంట్ వద్ద విగ్రహం తయారు చేయించాడు. క్రికెట్ మహా గణపతిగా నామకరణం కూడా చేసాడు.
News Posted: 6 February, 2010
|