గూగుల్ పై ఫిర్యాదులు న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నెట్ వీక్షకుల ఆదరణ పొందుతున్న ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇన్ కార్పొరేటెడ్ పై ప్రస్తుతం యూరోపియన్ ఏంటీట్రస్ట్ కమిషన్ దర్యాప్తు జరుపుతున్నది. గూగుల్ సాగిస్తున్న అన్యాయమైన పోటీపై మూడు సంస్థలు దాఖలు చేసిన ఫిర్యాదులపై ఆ కమిషన్ విచారణ జరుపుతున్నది. ధరలను పోల్చే యుకె సైట్ 'ఫౌండెమ్', ఫ్రెంచ్ లీగల్ సర్చ్ ఇంజన్ 'ఇజస్టిస్ డాట్ ఎఫ్ఆర్', మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ 'సియావో ఫ్రమ్ బింగ్' తమ పోటీ గురించి యూరోపియన్ కమిషన్ కు ఈ ఫిర్యాదులు చేసినట్లు గూగుల్ సంస్థ ఒక బ్లాగ్ లో తెలియజేసింది.
తన సెర్చ్ ఫలితాలలో తమ సైట్లకు గూగుల్ తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫౌండెమ్, ఇజస్టిస్.ఎఫ్ఆర్ ఫిర్యాదు చేశాయని గూగుల్ తెలిపింది. ఇక గూగుల్ ఏడ్ సెన్స్ సర్వీస్ లో భాగస్వామి అయిన సియావో ఫ్రమ్ బింగ్ ను 2008లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఆ సంస్థ ఫిర్యాదు గూగుల్ షరతులు, నిబంధనలకు సంబంధించినదని గూగుల్ తెలిపింది.
'తమకు అందిన ఫిర్యాదుపై పరిశీలన జరిపి ఆతరువాత వదలివేసే అలవాటు ఏంటీట్రస్ట్ అధికారులకు ఉంది' అని తైపీ కేంద్రంగా గల అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల సంస్థ ఐగర్ లా' భాగస్వామి జాన్ ఈస్ట్ వుడ్ పేర్కొన్నారు. అయితే, గూగుల్ కేసు గురించి ఆయనకు తెలియదు.
సియావో, ఇజస్టిస్.ఎఫ్ఆర్, ఫౌండెమ్ లకు పంపిన ఇ-మెయిల్ మెస్సేజ్ లకు వెంటనే తిరిగి పంపడం లేదు. సియావో తొలుత తన ఫిర్యాదును జర్మనీ ఏంటీట్రస్ట్ సంస్థ వద్ద దాఖలు చేసిందని, తరువాత ఆ కేసును యూరోపియన్ కమిషన్ కు బదలాయించారని గూగుల్ వివరించింది.
News Posted: 25 February, 2010
|