శవమై దొరికిన సైంటిస్ట్ చెన్నై :గత కొద్ది రోజులుగా ఆచూకీలేకుండాపోయిన సైంటిఫిక్ ఆఫీసర్ అనంతనారాయణ చివరకు శవమై కనిపించాడు. కల్పక్కమ్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పై ఆయన శవం కనిపించింది. ఇన్నాళ్లుగా కనిపించకుండా పోయిన అనంత నారాయణ శవంగా రైల్వే ట్రాక్ మీద దొరకడంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చెన్నైలోని కల్పక్కమ్ సమీపంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చి(ఐజీసిఎఆర్) కంప్యూటర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
ఈ నెల 15 తేదీ నుండి కనిపించడం లేదని, ఆఫీసుకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని అనంతనారాయణ మామ కల్పక్కమ్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అనంతనారాయణ ఆచూకీ కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పది రోజులు గడిచిన తరువాత ఆయన శవం రైల్యే ట్రాక్ మీద కనిపించడడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హత్య చేయబడ్డారా..లేక కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
News Posted: 26 February, 2010
|