బీచ్ లు గాయబ్!

విశాఖపట్నం : తీరాలు సాగరంలో కలిసిపోతున్నాయి. సైకత అందాలు అంతరించిపోతున్నాయి. మానవ అపరాధాలు, పర్యావరణ మార్పుల వలన సాగర తీరాలకు ముప్పు ముంచుకు వస్తోంది. అందరూ ఆనందంగా సేద తీరే బీచ్ లు అదృశ్యమవుతున్నాయి. ప్రకృతి సహజ సౌందర్యం..అనగానే ఠక్కున గుర్తోచ్చేది విశాఖ సాగర తీరం. ఎంతో రమణీయంగా వీక్షకులను కట్టిపేడేసే సహజమైన అందాలకు పెట్టింది పేరు విశాఖ తీర ప్రాంతం. సాగర తీరం క్రమంగా కోతకు గురవుతోంది. దీంతో విశాఖ అందాలు అంతరించిపోయే ప్రమాదం దాపురించింది.
సహజమైన అందాలను కాపాడాల్సిన ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. గోవా సాగర తీరం పరిరక్షణకు ఈ బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ తీరంపై కన్నెత్తి చూడనేలేదు. ఓకవైపు పర్యావరణ మార్పులు, మరోవైపు తీర ప్రాంత వనరుల దోపిడీతో బీచ్ అందాలకు ముప్పు ఏర్పడింది. ఈ ముప్పు కాస్త బీచ్ ను అంతరింప చేసే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2010
|