కొడుకు ప్రేమకు తల్లి బలి ఘజియాబాద్ : కొడుకు ప్రేమ వ్యవహారం తల్లి ప్రాణాలను తీసింది. పేదవాళ్లు, కులం తక్కువ వాళ్లూ తమింటి ఆడపిల్లను తీసుకుపోవడం ఆ మంత్రిగారి కుటుంబీకులకు నచ్చలేదు. కొడుకు చేసిన తప్పుకు తల్లిని చంపేసి పగ తీర్చుకున్నారు. ఈ కిరాతకం ద్వారా అలాంటి వాళ్లుకు హెచ్చరికలూ పంపారు. ఘజియాబాదాలోని విజయ్ నగర్ కుసుమ్ ,రాకేష్ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ మంత్రికి స్వయానా మరదలు వరస అవుతుంది. ఈ అమ్మాయి హత్యకు గురైన మహిళ కుమారుడుతో కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. అబ్బాయి కంటే అమ్మాయి కులం పెద్దది. అంతేగాక ఈ అమ్మాయి మైనర్. మేజర్ కావడానికి అవసరమైన 18 ఏళ్లు నిండటానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అలాగే ఈమెను వివాహం చేసుకున్న అబ్బాయికి కూడా కేవలం 18 ఏళ్లే. వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ లో పారిపోయి వివాహం చేసుకున్నారు. అమ్మాయి తరుపు నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అబ్బాయిపై కిడ్నాప్ కేసు నమోదు చేసారు. అంతేగాక ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆచూకీని కనుగొని గత ఫిబ్రవరి నెల రెండో వారంలో అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసారు.
కాగా, తాజాగా అబ్బాయి ఇంటిపై దాడి చేసి తల్లిని దుండగులు హత్య చేయడం సంచనం కలిగించింది. జరిగిన ఘటనను హత్యకు గురైన కుసుమ్ భర్త రాకేష్ మీడియాకు వివరించాడు. మంగళవారం రాత్రి 11 సమయంలో తాము టెర్రస్ పై భోజనం చేస్తున్నామని, అప్పుడే పల్సర్ బైక్ పై ఇద్దురు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చారని హత్యకు గురైన కుసుమ భర్త రాకేష్ చెప్పారు. తన పెద్ద కోడలు తలుపు తీయగానే దుండగులు తమపై దాడి చేయడం ప్రారంబించారని ఆయన వివరించారు. ఆ వెంటనే తన భార్య కుసుమ్ పై కాల్పులు జరిపి చంపారని ఆయన చెప్పారు. తన కుటుంబాన్ని రక్షించాల్సిందిగా చుట్టుపక్కల ఉన్నవారందరినీ వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. తదనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేసానని చెప్పాడు.
స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై ఘజియాబాద్ ఎస్పీ ఆదేశ్ కుమార విజైత మాట్లాడుతూ కుసుమ్ ను హత్య చేసిన నిందుతులను తాము గుర్తించామని వారి ఛాయా చిత్రాలను రూపొందించామని, త్వరలోనే వారిని అరెస్టే చేసి కేసు దర్యాప్తు సాగిస్తామని వెల్లడించారు.
News Posted: 3 March, 2010
|