మేయర్ రాజీనామా
కాకినాడ : సమైక్యాంధ్రను కోరుతూ కాకినాడ కార్పొరేషన్ మేయర్ కవికొండల సరోజ రాజీనామా చేశారు. ఆమెతో పాటు 36 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తామంతా సమైక్య ఆంధ్రను కోరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ సరోజ మాట్లాడుతూ కార్పొరేటర్ల బాటలోనే తాను పయనిస్తూ మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేటర్లు సిరియాల చంద్రరావు, దండు మహంతి లక్ష్మణరావు, చామకూర నాగబాబు, బసవా చంద్రమౌళి తదితరులు రాజీనామా పత్రాన్ని మేయర్ ఛాంబర్ లో వారు మేయర్ కు అందజేశారు.
News Posted: 11 December, 2009
|